15 లోపు వాలంటీర్లకు జీతాలు ఇవ్వకపోతే వీధి పోరాటాలే శరణ్యం
సిపిఐ నేత మిడుతూరు ప్రసాద్
జమ్మలమడుగు,న్యూస్ వెలుగు ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటరీ అసోసియేషన్ (AIYF ) అనుబంధ. ఆధ్వర్యంలో వాలంటీర్ల సమావేశం ఏర్పాటు చేసారు. సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల అసోసియేషన్ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ వాలంటీర్లకుఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్నికల హామీల ప్రకారం 10,000 గౌరవ వేతనం రాజకీయ ఒత్తులకు రాజీనామా చేసిన వాలంటీర్లు గౌరవ వేతన బకాయిలను రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్ల సమస్యలు గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటరీ చేత అటెండెన్స్ అనేది క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్స్ ను రాజకీయ పార్టీల ముసుగులో కాకుండా ఎవరు అధికారంలో ఉన్న ప్రజలకు సేవ చేయడమే మా వంతు బాధ్యతను నిర్వహిస్తున్నామే తప్ప ఇంకోటి కాదు రాజకీయరంగు మా వాళ్లకు పుయ్యకండి, సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే బకాయి గౌరవ వేతనాలు ఇవ్వాలి, లేకపోతే సెప్టెంబర్ 15 తేదీ లోపు పరిష్కరించకపోతే వీధి పోరాటాలతో ముందుకు వెళ్తామని హెచ్చరించారు. అన్ని జిల్లాల వాలంటరీలను సంఘటితం చేసి ముందుకు వెళ్లాలని తెలియజేశారు.ఈ సమావేశంలో నాయకుల రాంప్రసాద్ దేవదాసు హరి నాగార్జున రెడ్డి తిమోతి తదితరులు పాల్గొన్నారు.