హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ నిజాముద్దీన్,జూనియర్

కళాశాల నందు ప్రిన్సిపల్ ప్రవీణ ఆధ్వర్యంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాబోయే భావి భారత పౌరులుగా ప్రజాస్వామ్యంలో ఈ ఓటు హక్కు యొక్క పాత్ర మరియు విలువల గురించి వివరించారు.భారత పౌరులుగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం ఓటు హక్కు పై తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నిజాముద్దీన్,కళాశాలల్లో ప్రిన్సిపల్ ప్రవీణ ప్రతిజ్ఞ విధి చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు లేని వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రీ సర్వే తహసీల్దార్ ముకుందరావు,వీఆర్వోలు దామోదర,నాగరాజా,ప్రహ్లాద,సూరంజినేయులు,ఈరన్న,కంప్యూటర్ ఆపరేటర్ నర్సప్ప,బసవ,ఎంపీటీసీ మంజునాథ నాయక్,కార్యాలయం సిబ్బంది ఆనంద్,కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!