16 ఏండ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వినియోగంపై నిషేధం!

16 ఏండ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వినియోగంపై నిషేధం!

వయోపరిమితి విధించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచన
న్యూఢిల్లీ : ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ దానికి బానిలైపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్‌ మీడియా వినియోగానికి వయో పరిమితిని తీసుకురావాలని యోచిస్తున్నది. అందులో భాగంగా 16 ఏండ్లలోపు వారిపై నిషేధం దిశగా అడుగులు వేస్తున్నది.ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ వెల్లడించారు. పిల్లలు తమ డివైజ్‌లకు దూరంగా మైదానాల్లో కనిపించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ వంటి వాటి వినియోగం విషయంలో పిల్లల వయసు ఎంత ఉండాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కాకపోతే 14-16 ఏండ్ల మధ్య ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

Author

Was this helpful?

Thanks for your feedback!