చేనేత అభివృద్దికి మేము కట్టుబడి ఉన్నాం : కేంద్రమంత్రి

చేనేత అభివృద్దికి మేము కట్టుబడి ఉన్నాం : కేంద్రమంత్రి

Delhi (ఢిల్లీ ):  కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్  న్యూఢిల్లీలోని హ్యాండ్లూమ్ ఎక్స్‌పోను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు చేనేత కళాకారులను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో అనుసంధానం చేసి కొత్త డిజైన్‌లను ప్రవేశపెట్టేందుకు వీలు కల్పిస్తున్నామన్నారు.  చేనేత, హస్తకళల దేశీయ విక్రయాలు, ఎగుమతులను పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

చేనేతపై యువత అవకాశమలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన టెక్నాలజీ , రకరకాల డిజైన్లు, డెనిమ్, సిల్క్ తదితరాలను ప్రవేశపెట్టామని, ఇప్పుడు యువతకు చేనేత ఫ్యాషన్‌గా మారిందన్నారు. మొత్తం చేనేత రంగంలో భారతదేశం 90 శాతం వాటాను కలిగి ఉందని, 35 లక్షలకు పైగా కుటుంబాలు ఈ రంగంలో పనిచేస్తున్నాయని  గిరిరాజ్ సింగ్ చెప్పారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా కళాకారులకు జాతీయ జెండాలను పంపిణీ చేసిన ఆయన ఈ ప్రచారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

Author

Was this helpful?

0/400
Thanks for your feedback!