
19న మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు
తుగ్గలి, న్యూస్ వెలుగు; సెప్టెంబర్ 19 గురువారం రోజున మండల స్థాయి అన్ని పాఠశాలల క్రీడా పోటీల ఎంపిక కార్యక్రమం జరుగుతుందని మండల విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు తెలియజేశారు.ఈ సందర్భంగా మంగళవారం రోజున మండల విద్యా శాఖ అధికారి రమా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తుగ్గలి మండల స్కూల్ ఆట పోటీల నిర్వహణపై వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది.తుగ్గలి మండల క్రీడలు ఈ నెల 19వ తేది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్.ఎస్ పెండేకల్ క్రీడామైదానంలో ఉదయం 9 గంటలకు బాల బాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు.ఈ క్రీడలకు మండలంలోని జిల్లాపరిషత్,గురుకుల, కేజీబీవీ,ఆశ్రమ పాఠశాలతో పాటు మండలంలోని ప్రైవేట్ పాఠశాలలలో చదువుతున్న 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చని వారు తెలియజేశారు. అండర్-14, అండర్-17 విభాగాలలో కబడ్డీ,ఖో-ఖో,వాలీబాల్,యోగ,చెస్, షటిల్,బాడ్మింటన్, అథ్లెటిక్స్ క్రీడల నందు టోర్నమెంట్ కమ్ సెలక్షన్ విధానంలో ఎంపిక పోటీలు జరుగుతాయని తుగ్గలి స్కూల్ గేమ్స్ మండల కోర్డినేటర్ పి.డి పాండురంగరాజు తెలిపారు.ముఖ్యంగా కబడ్డీ క్రీడలో పాల్గొనే క్రీడాకారులు అండర్-14 విభాగంలో బాలురు-51 కేజీలు,బాలికలు-48 కేజీలు మరియు అండర్-17 విభాగంలో బాలురు-55 కేజీలు,బాలికలు-55 కేజీలు మించి ఉండరాదని ఆయన తెలియజేశారు. ఎంపికైన క్రీడాకారులు త్వరలో జరగబోయే పత్తికొండ నియోజకవర్గ స్థాయి ఎంపిక పోటీలలో పాల్గొంటారని ఆయన తెలిపారు.మిగిలిన క్రీడలు ఫుట్బాల్,క్రికెట్,త్రోబాల్,సాఫ్టబాల్ వంటి క్రీడలు ఈ నెల (సెప్టెంబర్) చివరి వారం కర్నూల్ నందు నేరుగా జిల్లాస్థాయి సెలక్షన్ విధానంలో జరుగుతాయని తెలిపారు.అలాగే ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు వ్యాయమ ఉపాధ్యాయుల సంతకంతో కూడిన ధ్రువపత్రాలు తీసుకొని రావాలని ఫిజికల్ డైరెక్టర్ పాండురంగరాజు తెలిపారు.ఈ సమావేశంలో పత్తికొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ జిల్లా సెక్రెటరీ చందు నాయక్,వ్యాయామ ఉపాధ్యాయులు వేణుగోపాల్, హనుమన్న,ఆంజనేయులు,రంగస్వామి
సలోమీ,జయలక్ష్మి,మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.