చేనేత కార్మికులకు రాష్ట్ర బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించాలి

చేనేత కార్మికులకు రాష్ట్ర బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించాలి

       చేనేత కార్మిక సంఘం డిమాండ్

కర్నూలు, న్యూస్ వెలుగు; చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆంధ్ర ప్రదేశ్ చేనేత కార్మిక సంఘం

ఆధ్వర్యంలో సి ఆర్ భవన్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు చేనేత కార్మిక నాయకులు కార్మికులు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ ఆఫీస్ ముందు గాంధీ విగ్రహం దగ్గర చేనేత కార్మిక సంఘం నాయకుడు మాధవ స్వామి అధ్యక్షతన కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా జరిగినది ఈ ధర్నా కార్యక్రమానికి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని ఎన్నికల ముందు చేనేత కార్మికులకు 200 వరకు కరెంటు యూనిట్లు ఉచితంగా ఇస్తామని చేనేత వస్త్రాలపై జీఎస్టీ ని తొలగిస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారని రాష్ట్ర బడ్జెట్లో సవరణ చేసి చేనేత కార్మికులకు 2000 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం చేనేత కార్మికులకు 200 వరకు కరెంటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సహకార సంఘాలకు ఎన్నికలు జరపాలని దాని ద్వారా ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీన రామాంజనేయులు గారు మద్దతు తెలియజేశారు ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రామచంద్రయ్య
కడుపు కన్నయ్య లక్ష్మి కట్ట హేమ సుందర్రావు
సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!