హోళగుంద,న్యూస్ వెలుగు: పశు సంరక్షణ సమాచారం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 25 నుండి 28/02/2025 వరకు ప్రతి గ్రామంలో 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం నిర్వహించబడం జరుగుతుందని శుక్రవారం పశువైద్య సహాయకులు జిలాన్ తెలిపారు.ముందుగా కొగిలతోట గ్రామంలో కార్యక్రమం పై

గొడపత్రిక విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ ఇంటికి వచ్చే విషయ సేకరణ దారులకు మీ పశువుల సమగ్ర సమాచారం,తద్వారా పశుగణ పథకాల రూపకల్పనకు ప్రజలు సహకరించాలని కోరారు.అలాగే మన రాష్ట్రంలో 21.173 గ్రామాల పట్టణ ప్రాంతాలలో పశువుల వివరాలు నమోదు చేయుచున్నట్లు పేర్కొన్నారు.పశువుల రకాలు గేదెలు,గొర్రెలు,మేకలు,పందులు,గుర్రాలు వివిధ రకాల కోళ్లు,పక్షులతో సహా 16 రకాల పెంపుడు జంతువుల పై జాతుల వారిగా సమాచారాన్ని సేకరించినది.పశు గణనను ప్రతి ఐదు సంవత్సరాల ఒక్కసారి నిర్వహిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు,సీనియర్ నాయకులు,గ్రామస్తులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!