
సైబర్ నేరాలను అరికట్టేందుకు 250 మంది
అమరావతి : విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నగర పోలీసులు మారథాన్ నిర్వహించారు.
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైబర్ క్రైమ్ అవగాహన పేరుతో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.
సైబర్ నేరాలను అరికట్టేందుకు 250 మంది సైబర్ కమాండోలు, 2000 మందికి సైబర్ సోల్జర్స్ శిక్షణ ఇచ్చి నగర పోలీసులు నియమించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు.
నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని హోం మంత్రి అనిత అన్నారు. కార్యక్రమంలో ఎమ్మల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!