
270 కేజీల గంజాయి స్వాధీనం
న్యూస్ వెలుగు విశాఖపట్నం : విశాఖపట్నం నుంచి హర్యానా వెళ్తున్న లారీలో 135 ప్యాకెట్లు గల 270 కేజీల గంజాయి తరలిస్తుండగా గుర్తించి స్వాధీనపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 13,50,000/- రూపాయలు గ ఉంటుందని పోలీసులు తెలిపారు. భీమవరంనకు చెందిన నేరస్థుడు పందిరి వెంకట నారాయణ అరెస్ట్ చేసినట్లు తెలిపారు . ఇతనిపై రాష్ట్ర వ్యాప్తంగా 57 కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఇతని వద్ద నుంచి 630 గ్రాముల బంగారాన్ని స్వాధీనం కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రాత్రి సమయంలో ఒంటరిగా దొంగతనాలు చేయడం, దొంగిలించిన బంగారం అంతా ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టడం ఇతని నేర ప్రవృత్తి గా పోలీసులు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!