29న  ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలు

29న  ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలు

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్ వెలుగు;  సెప్టెంబర్ 29 వ తేదిన ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు.మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ప్రపంచ హృదయ దినోత్సవానికి సంబంధించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హృదయ స్పందనపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్‌లు సంయుక్తంగా నిర్వహిస్తాయన్నారు.. ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి అనువైన వ్యాయామం, దురవాట్లకు దూరంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యంగా పని చేస్తోందన్నారు.. ఈ నెల 29వ తేదిన నిర్వహించే ప్రపంచ హృదయ దినోత్సవంలో గుండె వ్యాధులు రావడానికి కార‌ణాలు, గుండె వ్యాధులు రాకుండా ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి తదితర విషయాలపై ప్రజలకు వైద్యులు అవగాహన కల్పిస్తారన్నారు.హార్ట్ ఫౌండేషన్ సెక్రటరీ డా.చంద్రశేఖర్ మాట్లాడుతూ కర్నూల్ లో హార్ట్ ఫౌండేషన్ 2002 సంవత్సరంలో మొదలు పెట్టడం జరిగిందని, అప్పటి నుండి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము సెప్టెంబరు 29వ తేదిన ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్నామన్నారు. సంబంధిత కార్యక్రమంలో ఔట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అత్యుత్తమ సేవలు అందించిన వైద్యునికి ఇవ్వడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం ఔట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ తరపున డా.డి.రాజశేఖర్, ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, తిరుపతి వారికి అందజేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా గుండె పోటు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద వైద్యులు అవగాహన కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో హార్ట్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ లు కల్కూర చంద్రశేఖర్, డా.భవాని ప్రసాద్, ట్రెజరర్ రాముడు, సభ్యులు శర్మ, లక్ష్మణ్, వాసుదేవ మూర్తి, ప్రహ్లాద్, జగన్నాథ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!