
అంబులెన్స్ లో తరలిస్తున్న 3 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం,న్యూస్ వెలుగు ; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో రామవరం సింగరేణి సివిల్ విభాగం కార్యాలయం వద్ద అంబులెన్స్ లో తరలిస్తున్న సుమారు 3 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ తో ఉన్న అంబులెన్స్ పంక్చర్ కావడంతో కొత్తగూడెం దగ్గర ఆగిపోయింది. పంక్చర్ వేసేందుకు వాహన సిబ్బందికి సహకరించిన వ్యక్తులకు వాహనంలో గంజాయి పొట్లాలు ఉన్నట్లు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రెండో టౌన్ సీఐ ఐఎన్. రమేశ్ వాహనాన్ని తనిఖీ చేసి వాహనాన్ని, గంజాయి తీసుకెళ్తున్న ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. పగంజాయి విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Was this helpful?
Thanks for your feedback!