
కుక్కదాడిలో 30 గొర్రె పిల్లలు మృతి…
కుక్కదాడిలో నష్టపోయిన గొర్రెల కాపరిని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి
న్యూస్ వెలుగు బోగులాంబ : జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికిచెందిన గొల్ల రాముడు తండ్రి రోషన్న వీరికి 1500 గొర్రెల మంద జీవాలు కలవు ఈ మందను ఓ రైతు పొలములో ఆపడం జరిగింది.వీటికి చిన్న సన్న పిల్లలు 300 వందలు కలవు ఈ పిల్లలను చుట్టు కంచె వేసి పిల్లలను భద్రపరచడం జరిగింది. విటి మేత కొసం కాపారి మరో పొలం దగ్గరకు వెళ్లడంతో ఎటు నుండి వచ్చిందో తెలియదు కాని రెండు కుక్కలు మాత్రం బయట నుండి లోపల ఉన్న గొర్రె పిల్లలను చంపి తినటానికి ప్రయత్నాలు చేశాయి అవకాశం లేకపోవడంతో ఒక కుక్క కంచె లోపలికి ఏలా వెళ్లిందో కానీ మొదటగా చిక్కిన గొర్రె పిల్లను సగంతిని వదలి పెట్టింది. మిగతా వాటిని గొంతు కొరికి రక్తం త్రాగి మాంసాని తినకుండ వదలి పెట్టడం జరిగింది.పొలం గెట్టు వెంబడి ఓ రైతు పత్తి కట్టే కాల్చుకుంటు వస్తున్న రైతుకు గొర్రె పిల్లల అరుపు ఎక్కువగా వినపడటంతో కంచె దగ్గరకు వచ్చిన రైతు కంచె లోపల ఉన్న కుక్క గొర్రె పిల్లల గొంతు కోరుకుతున్న దృశ్యాన్ని చూసిన రైతు వెంటనే కాపరికి తెలపడంతో హడావుడిగా వచ్చిన గొర్రెల కాపరి మరియు రైతు తమ చేతిలో ఉన్న కర్రతో కుక్కను కొట్టి చంపడం జరిగింది. ఒకే గొర్రె పిల్ల చనిపోయింది అనుకుంటే ఏకంగా 30 పిల్లలు చనిపోవడం జరిగింది. ఒక్కొక్క పిల్ల 5వేల చొప్పున లెక్కిస్తే 1లక్ష 50వేల రూపాయలు నష్టపోవడం జరిగింది. కావున ప్రభుత్వపరంగా మమ్మును ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ని కోరుతున్నాము.