
7.7 కోట్లు విరాళం ఇచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్
అమరావతి : భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులు అయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ సంఘాలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు వరద సహాయక చర్యల కోసం తమవంతు ఆప్త హస్తం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,097 మంది సర్పంచుల ఒక నెల గౌరవ వేతనం మొత్తం రూ.3.92 కోట్లు, సంఘం అధ్యక్షులు చిలకలపూడి పాపారావు ఆధ్వర్యంలో అందుకు సంబంధించిన అంగీకార పత్రాన్ని ఉప ముఖ్యమంత్రి అందుకున్నారు.