పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 3,580 కోట్లను తక్షణమే విడుదల చేయాలి

పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 3,580 కోట్లను తక్షణమే విడుదల చేయాలి

న్యూస్ వెలుగు, కర్నూలు; విద్యార్థుల ఉన్నత ఆ చదువులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలి హాస్టల్ విద్యార్థుల కు 8 నెలల నుంచి పెండింగ్లో ఉన్న మెస్ కాస్మోటిక్ చార్జీలను తక్షణమే విడుదల చేయాలి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కర్నూల్ నగరంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగినది ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి సోమన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను విడుదల చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క ఫీజులను కూడా విడుదల చేయకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు అదే విధంగా ఇప్పటికి కూడా ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా 2100 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయని,1480 కోట్ల రూపాయల వసతి దీవెన పెండింగ్ లో ఉన్నాయని వీటిని తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఇవ్వగలం పాదయాత్రలో పై చదువులకు శాపంగా మారినటువంటి జీవోలను రద్దు చేస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా చెయ్యకపోవడం దారుణమని ఆయన మందు పడ్డారు ఉన్నత చదువులు పీ.జీ. చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రైవేట్, ఎయిడెడ్, కళాశాలల్లో పీ.జీ. చేస్తే స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెనలు, ఇవ్వమని చెప్పుతున్నటువంటి జీవో నెంబర్ 77 వలన పై చదువులకు పోయేటువంటి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉన్నత చదువులకి పోయేటువంటి విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 ను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ అదేవిధంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు 8 నెలల నుంచి మిస్ బిల్లులు కానీ కాస్మోటిక్ ఛార్జీలు కానీ ఇవ్వకపోవడం వలన హాస్టల్ వార్దన్లు విద్యార్థులకు పౌష్టికాహారం అందించకుండా విద్యార్థులను అర్దాకలతో పాఠశాలలకు కళాశాలలకు పంపుతా ఉన్నారని తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి మిస్ కాస్మోటిక్ చార్జీలను విడుదల చేసి సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అమ్మ ఒడిని విడుదల చేయాలని వీటిని చేయకపోతే పెద్ద ఎత్తున విద్యార్థుల తోటి ధర్నాలు చేపడతామని అవసరమైతే అసెంబ్లీ ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు యస్.అభి, సి.అశోక్, విజయ్, ఈశ్వర్ ,చరణ్ ,చింటూ, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!