జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో 36వ జాతీయ రోడ్డు భద్రత పై అవగాహన సదస్సు

జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో 36వ జాతీయ రోడ్డు భద్రత పై అవగాహన సదస్సు

          ఎంవిఐ, కె రవీంద్ర కుమార్

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామం లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమాలు 28వ రోజు కొనసాగుతున్నాయి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంత కుమారి ఆదేశాల మేరకు నిర్వహించారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె రవీంద్ర కుమార్, పర్యవేక్షణలో రోడ్డు భద్రత సదస్సు కొనసాగింది, ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కంపెనీల మేనేజర్లు, సర్వేర్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్లు మరియు డ్రైవర్లు, ప్రజలు వాహనదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా, డ్రైవర్లకు వాహనాదారులకు రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కల్పించరు. అనంతరం ఇన్సూరెన్స్ కంపెనీల మేనేజర్లు మాట్లాడుతూ వాహనదారులు వాహనలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ను కట్టుకోవాలని వాహన యజమానులకు తెలియజేశారు. వాహనానికి సంబంధించిన రికార్డు కరెక్టుగా ఉండి ఇన్సూరెన్స్ ఉంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహంలో ఉండే మనుషులకు మరియు వాహనం ఎదుటివారికి గాయపడిన, చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ కంపెనీ వారు గాయపడిన, చనిపోయిన, కుటుంబానికి ప్రమాద బీమాను అందిస్తారు. వాహన రికార్డులో ఏ ఒక్కటి లేకున్నా ప్రమాద బీమా వర్తింపదని వారు అన్నారు.
కొత్త వాహనాలు కోన్నప్పుడు ఫుల్ ఇన్సూరెన్స్ కట్టిస్తారు, దాని తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత వాహనాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ను తప్పనిసరిగా కట్టుకోవాలని యజమానులకు తెలిపారు. వివాహనాలకు ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు వాహనానికి సంబంధించిన రికార్డు అనగా ఆర్సి బుక్, పొల్యూషన్, రోడ్డు పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి అని తెలిపారు. ఇన్స్పెక్టర్లు మాట్లాడుతూ మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, రాష్ డ్రైవింగ్, అధిక వేగం అత్యంత ప్రమాదకరమన్నారు, వాహనదారులు మత్తు పదార్థాలు, మరియు మద్యం సేవించి వాహనం నడపకూడదన్నారు, ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాం డ్రైవింగ్ చేయడం ఎంతో ప్రమాదకరమన్నారు. అదే విధంగా కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ను ధరించడం దాని యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ సర్వేర్ ఎంఏ ఆఫీజ్, ఎమ్మెస్ఎ మోటర్ కంపెనీ మేనేజర్స్ షకీల్ అహ్మద్, ఇలియాజ్ అహమ్మద్, ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ మేనేజర్ కృష్ణ, ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ శబజ్ మహమ్మద్, లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ మేనేజర్ సుంకన్న, బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ సేల్స్ విజయ్ కుమార్, సేల్స్ మేనేజర్ మహబూబ్ బాషా, ఇఫ్కో టోకియా క్లెయిమ్స్ మేనేజర్ ఇంతియాజ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కే రవీంద్ర కుమార్ ఎం బి సుధాకర్ రెడ్డి. నాగరాజు నాయక్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వి. బాబు కిషోర్, గణేష్ బాబు, ట్రాన్స్పోర్ట్ హెడ్ కానిస్టేబుల్లు చలపతి, వి. విజయ భాస్కర్, మరియు హోమ్ గార్డ్లు. డ్రైవర్లు మరియు యజమాన్యం, ఇతర ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!