మధ్యవర్తిత్వం పై న్యాయవాదులకు 40 గంటల శిక్షణ
న్యూస్ వెలుగు, కర్నూలు; రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు సోమవారం 16-12-2024 కర్నూలు,నంద్యాల జిల్లాల న్యాయవాదులకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటి కార్యాలయ భవనం లో శిక్షణను జిల్లా ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తి/ జిల్లా న్యాయ సేవాది కార సంస్థ అధ్యక్షులు పాండు రంగా రెడ్డి ప్రారంభించారు. తర్వాత జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం హైకోర్ట్ అన్నీ జిల్లా కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశ పెట్టాలని తీర్మానించింది అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16 నుంచి 20 వరకు (భావన & మధ్యవర్తిత్వం యొక్క సాంకేతికతలు) మధ్యవర్తిత్వంలను యే విధంగా చేయాలి అని న్యాయవాదులకు అవగాహన కల్పించనున్నారు. చెన్నై,బెంగళూరు ల నుండి మధ్యవర్తిత్వం శిక్షణ సిబ్భంది యస్.అరుణాచలం మరియు యస్. ఎన్.సుధ వచ్చారు. తదనంతరము జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఈ కార్యక్రమమును కొనసాగించారు వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 89 క్రింద పరిగణించేదే మధ్యవర్తిత్వం అని తెలిపారు. దీనివల్ల కోర్ట్ లో కేసులు విచారణ వరకు వెళ్లకుండా పరిష్కరించు కోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమములో కర్నూలు,నంద్యాల జిల్లాల న్యాయవాదులు పాల్గొన్నారు.