
శ్రీ భీరప్ప స్వామి దేవాలయ నిర్మాణం నకు 43,200/ విరాళం
న్యూస్ వెలుగు కర్నూలు: కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పెద్దపాడు రోడ్డులోని ఏ. పి.ఆదర్శ పాఠశాల పక్కన నిర్మాణం లో ఉన్న శ్రీ భీరప్ప స్వామి దేవాలయ నిర్మాణం నిమిత్తం కల్లూరు మండలం పందిపాడు గ్రామ కురువ సంఘము వారు శుక్రవారం తమ వంతుగా 43,200 రూపాయలు నగదును విరాళంగా పందిపాడు గ్రామ కురువ సంఘం కమిటీ సభ్యులు కే. భీష్ముడు, డి. బీసన్న, పెద్ద మద్దిలేటి, కే. రాముడు, కే. పి. నాగన్న, బొజ్జన్న మద్దిలేటి లు కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కే. రంగస్వామి జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ, కోశాధికారి కే. సి. నాగన్న,మాజీ జిల్లా అధ్యక్షులు ఎస్. నాగన్న,. నగర అధ్యక్షులు . తవుడు శ్రీనివాసులు.బి. సి.తిరుపాల్,పెద్దపాడు పుల్లన్న,.తదితరుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కే.రంగస్వామి మాట్లాడుతూ దేవాలయ నిర్మాణం, కమ్యూనిటీ హాల్ మరియు విద్యార్థుల హాస్టల్ నిర్మాణమునకు దాతలు ముందుకు వచ్చి విరాళాలను ఇవ్వాలని పిలుపునిచ్చారు.