
వృద్ధులకు,విలేకరులకు,కళాకారులకు రైల్వే చార్జీలో 50%ఆ రాయితీని పునరుద్ధరించాలి
వికలాంగులకు జబ్బు పడ్డవారికి తమ వెంట రైల్లో ఒకరికి ఉచిత ప్రయాణం కల్పించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; వృద్ధులకు, విలేకరులకు, కళాకారులకు రైల్వే చార్జీలో గతంలో ఇస్తున్న 50% రాయితీని పునరుద్ధరించాలనీ.. వికలాంగులకు, జబ్బుతో పడ్డవారికి తమతో పాటు మరొక సహాయ కారికి ఉచిత ప్రయాణం కల్పించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, రిటైర్డ్ లెక్చరర్ ఎస్ సర్ఫుద్దీన్, బిఎస్ఎన్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి మహేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టు గోరంట్లప్ప, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి టీ మద్దిలేటి రైల్వే శాఖను కోరారు. ఈరోజు ఉదయం రైల్వే స్టేషన్ ఎదుట బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం యాకోబ్ అధ్యక్షతన ధర్నా జరిగింది. ఈ ధర్నాలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగు, పత్రికా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ కాలనీలా అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు రవాణా ప్రయాణం ఖర్చుతో పాటు శ్రమతో కూడుకున్నదని, రైల్వే ప్రయాణం సులభంగా ఉంటుందన్నారు.60 ఏళ్లు నిండిన వృద్ధులు ఇతరులపై ఆధారపడకుండా 50 శాతం చార్జీతో బంధుమిత్రుల దగ్గరికి వెళ్లేవారు. విలేకరులు పలు ప్రాంతాల్లో తిరిగి వ్యవస్థలో ఉండే లోపాలు,ప్రజల సమస్యలను సేకరించి ప్రభుత్వానికి ప్రజల దృష్టికి తెచ్చేవారన్నారు. కళాకారులు వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందడం,ఉచిత ప్రదర్శనలు ఇచ్చేవారని అన్నారు. అనారోగ్యంతో ఉన్నవారు దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేసుకునే వారని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా సమయంలో రైల్వే ఛార్జీలో ఇస్తున్న రాయితీలను రద్దు చేసి.. వృద్ధులకు వికలాంగులకు విలేకరులకు కళాకారులకు జబ్బు పడ్డ వారికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.అధానీ,అంబానీ లాంటి బహుళజాతి సంస్థలకు 15 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు రద్దు చేయడంతో పాటు అనేక రాయితీలు ఇస్తున్న బిజెపి ప్రభుత్వానికి వృద్ధులు వికలాంగులు విలేకరులు కళాకారులు జబ్బు పడ్డవారికి ఇచ్చే రాయితీలు బరువయ్యాయా? అని ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గతంలో ఇచ్చిన రైల్వే చార్జీలో రాయతీలన్నీ పునరుద్ధరించడంతో పాటు వికలాంగులకు,జబ్బున పడ్డ వారికి వారితో పాటు వారి వెంట మరొకరికి ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు. ధర్నా అనంతరం రైల్వే మాస్టర్ నాగరాజుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ శాఖల పెన్షనర్స్ మద్దిలేటి, చంద్రశేఖర్, పాపయ్య, బి నాగేంద్ర, రిటైర్డ్ డి.ఎస్.పి పాపారావు, గోపీనాథ్, వెంకట నర్సు పీటర్, పత్రికా రంగం నుండి ఇసుప్ ఖాన్, అంజి,వివిధ కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, ఉస్మాన్ భాష, యూనూస్, వర్మ, రమణ గౌడ్, చిన్న భాష, సర్దార్, శంకర్ రెడ్డి,అన్వర్ భాష, తదితరులు పాల్గొన్నారు.