జర్నలిస్ట్ పిల్లలకు వెయిట్ కార్పొరేషన్ ఎయిడెడ్ స్కూల్లో 50% ఫీజు రాయితీ

జర్నలిస్ట్ పిల్లలకు వెయిట్ కార్పొరేషన్ ఎయిడెడ్ స్కూల్లో 50% ఫీజు రాయితీ

న్యూస్ వెలుగు, కర్నూలు; జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్, ఎయిడెడ్ స్కూల్స్లో 50% ఫీజు రాయితీ కల్పిస్తూ.. ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ను, డీఈవో శామ్యూల్ ఫాల్ ను కలసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా జిల్లాలో ఇంటి స్థలాలు లేని జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు త్వరగా ఇచ్చే విధంగా చూడాలని కోరడం జరి

గింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ఇస్తామని సానుకూలంగా చెప్పడం జరిగింది. కలెక్టర్, డీఈఓ ను కలిసిన వారిలో ఐజేయూ జాతీయ సమితి సభ్యులు జి కొండప్ప, కే నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈఎన్ రాజు, కే శ్రీనివాస్ గౌడ్, ఆంధ్ర జ్యోతి డెస్క్ ఇన్చార్జి నవీన్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా నాయకులు మధుసూదన్ గౌడ్, హుస్సేన్, జిల్లా ఉపాధ్యక్షుడు దస్తగిరి, సహాయ కార్యదర్శి అవినాష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు చిరంజీవి, మధు, సబ్ ఎడిటర్స్ మనోహర్, తుంబల్, జిల్లా నాయకులు, మంజునాథ్ యాదవ్, నాగప్రసాద్ యాదవ్, మల్లికార్జున, లక్ష్మన్న, రంగా, గంగాధర్, ఓర్వకల్లు ఇంతియాజ్, వీడియో జర్నలిస్టు సూరి, చంద్ర శేఖర్, ఫోటో జర్నలిస్టు రఫీ, శీను తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!