
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; ఉభయ రాష్ట్రాల జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశము హైదరాబాదులోని రవీంద్ర భారతి ప్రెస్ క్లబ్ నందు ఘనంగా జరిగినది ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పాల్గొనడం జరిగింది మరియు నూతన కార్యవర్గము ను ఎన్నుకోవడం జరిగినది బీసీల పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కుల దూషణ ఇలాంటివి ఏమైనా జరిగితే ఎస్సీ ఎస్టీలకు ఉన్న విధంగానే అట్రాసిటీ చట్టాన్ని తేవాలని దేశవ్యాప్తంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవాలని దేశవ్యాప్తంగా 56% ఉన్నటువంటి బీసీలు ఎస్సీ, ఎస్టీలకు పార్లమెంట్లో గాని శాసనసభలో గానీ 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని జనగణనలో కులగన చేపట్టాలని బీసీలకు కేంద్ర బడ్జెట్ లో రెండు లక్షల కోట్లను కేటాయించాలని బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఉభయ రాష్ట్రాల్లో నామినేటెడ్ పదవులలో 50% కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగినది. ఈ కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎర్ర సాని నాగేశ్వరరావు యాదవ్ , రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఎలగాల నూకానమ్మ యాదవ్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గౌతమ పోయిన గురుమూర్తి యాదవ్, సెక్రటరీ జనరల్ గా బడబాగ్ని వెంకటరమణ రాజు , మరి కొంతమందిని ఎన్నుకోవడం జరిగినది ఈనెల 24 వ తారీఖున జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు కనీసం పదివేల మందితో భారీ బహిరంగ సభ జరుపుటకు తీర్మానించడం అయినది.