
శ్రీ భీరప్ప స్వామి దేవాలయ నిర్మాణం నకు 50 వేలు విరాళం
కర్నూలు, న్యూస్ వెలుగు: కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పెద్దపాడు రోడ్డులోని ఏ. పి.ఆదర్శ పాఠశాల పక్కన నిర్మాణం లో ఉన్న శ్రీ భీరప్ప స్వామి దేవాలయ నిర్మాణం నిమిత్తం కర్నూలు నగరంలోని కె. వెంకటరమణ 25,000 మరియు కె.శ్రీనివాసులు 25,000 రూపాయలు నగదును శనివారం విరాళంగా కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కే. రంగస్వామి, కోశాధికారి కే. సి. నాగన్న సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కే.రంగస్వామి మాట్లాడుతూ దేవాలయ నిర్మాణం, కమ్యూనిటీ హాల్ మరియు విద్యార్థుల హాస్టల్ నిర్మాణమునకు దాతలు ముందుకు వచ్చి విరాళాలను ఇవ్వాలని పిలుపునిచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!