సుఖ వ్యాధులపై అవగాహన తప్పనిసరి : రామాంజినేయులు
డోన్ మండలం న్యూస్ వెలుగు : దేవరబండ గ్రామంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆద్వర్యంలో…ఉచిత వైద్య శిభిరం
నిర్వహించడం జరిగింది. ఈ యెక్క కార్యక్రమానికి సర్పంచ్ డి. పద్మావతి సహాకారంతో హెచ్ఐవి/ఎయిడ్స్ మరియు సుఖ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన రక్త పరీక్షలు నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్ తెలిపారు.
అవగాహన కార్యక్రమంలో 104 మెడికల్ ఆఫీసర్ డా.ఎం. శ్రీకాంత్ మాట్లాడుతూ హెచ్.ఐ.వి వ్యాధి పట్ల వలస కూలీలు,హమాలీ వర్కర్స్, మరియు యువత కు హెచ్.ఐ.వి పట్ల అవగాహన కలిగి ఉండడం వల్ల హెచ్.ఐ.వి కి గురికాకుండా చూసుకోవచ్చని, చికిత్స కన్నా నివారణ మంచిదని వారు తెలిపారు. హెచ్.ఐ.వి కేవలం అరక్షిత లైంగిక సంబంధాలు , హెచ్.ఐ.వి ఉన్న గర్భిణీ నుండి పుట్టబోయే బిడ్డకు, హెచ్ఐవితో కలుషితమైన సూదులు సిరంజీలు, పరీక్షింపబడని రక్తము ద్వారా మాత్రమే సంక్రమించే అవకాశం ఉందని తెలిపారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో హెచ్.ఐ.వి పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. హెచ్.ఐ.వి. ఉంది అని నిర్ధారణ అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న ART కేంద్రాలు, లింక్ ART కేంద్రాల ద్వారా ఉచితంగా ART మందులు అందుబాటులో ఉన్నాయని, మందులు వాడుతూ, వైద్యుల సలహాలు పాటించినట్లయితే ఎటువంటి ఆరోగ్య పరమైన ఇబ్బందులు లేకుండా జీవితం కొనసాగించవచ్చు అని తెలిపారు. హెచ్.ఐ.వి. ఉందనే కారణంతో వివక్ష చూపకూడదు అని, అది హెచ్.ఐ.వి./ ఎయిడ్స్ చట్టం – 2017 ప్రకారం శిక్షార్హమైన నేరమని పేర్కొన్నారు. హెచ్.ఐ.వి. పట్ల ఎటువంటి సందేహాలు/ అనుమానాలు ఉన్నా జాతీయ హెల్ప్ లైన్ 1097 కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలియచేసారు. జోనల్ సూపర్ వైజర్ హెచ్. రామాంజినేయులు మాట్లడుతూ ఈ కార్యక్రమం ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 100 గ్రామాల్లో అవగహన సదస్సులు మరియు సేవలు అందించడం జరుగుతుంది. ముఖ్యముగా యువత, మహిళలు, పొదుపు సంఘలు, కార్మికులు , గ్రామా ప్రజలను భాగస్వాములు చెయ్యాలి అని చేప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా సిబ్బంది వి .శ్రీనివాస ఆచారి CHO ఎం. సంధ్యారాణి , ఆశాలు, వైద్య సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.