ఘనంగా 537వ శ్రీ భక్త కనకదాసు జయంతి

ఘనంగా 537వ శ్రీ భక్త కనకదాసు జయంతి

హొళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఎండీ హాల్లి, కోగిలతోట,బిజి హాళ్లి,పెద్దహ్యట వందవాలి లింగంపల్లి మొదట మాగి మార్ల మడికి తదితర గ్రామాల్లో సోమవారం దాస శ్రేష్ఠులు శ్రీ భక్త కనకదాసు 537వ జయంతిని మదాసి మదారి కురువలందరూ కలిసికట్టుగా ఘనంగా నిర్వహించారు.అనంతరం గ్రామంలో శ్రీ భక్త కనక దాసు చిత్రపటాని చిన్నారులు కళశాలతో గ్రామ పురవిధుల్లో మేళతాళలతో,డప్పు వాయిద్యలతో అంగరంగ వైభవంగా ఊరేగించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బళ్ళారి మాజీ మేయర్ శశికళ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కురువలు అందరూ ఐక్యమత్యంగా ఉండి,పిల్లలను విద్యావంతులను చేసి అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.మదాసి మదారి కురువ సామాజిక వర్గంలో శ్రీ శ్రీ భక్త కనకదాసు జన్మించడం మా సామాజిక వర్గానికి ఎంతో అదృష్టమని భావించారు.అలాగే ఉడిపిలో శ్రీకృష్ణ దర్శనానికి వెళితే అక్కడున్న బ్రాహ్మణులు దర్శనం చేసుకోనీయకుండా మీరు శూద్రులు తక్కువ కులం వారు మీరు గుడి లోపలికి రాకూడదని గెంటి వేయడంతో వెంటనే కనకదాసు ఇంకోవైపు వెళ్లి శ్రీకృష్ణుని మనస్ఫూర్తిగా తలుచుకొని నాకు నీ దర్శనం కావాలి అని అడగడంతో శ్రీకృష్ణుడే ఆయన భక్తికి మెచ్చి కనకదాసు కూర్చున్న వైపు తిరిగి దర్శనం ఇవ్వడం జరిగిందన్నారు.అందుకే ఇప్పటికి కూడా ఉడిపిలో శ్రీకృష్ణ దేవాలయంలో కచ్చితంగా కనక కిటికీ అని పేరు ఉంది.నేటికి శ్రీకృష్ణ దర్శనం చేసుకోవాలంటే అక్కడికి వచ్చిన భక్తులు కనక కిటికీ నుంచే దర్శనం చేసుకోవడం ఆచారం కొనసాగుతూనే ఉందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధాకర్,శేషన్న,నాగప్ప, శంభలింగ,ఈశ్వర్,మౌనిష్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!