తహసిల్దార్ హుస్సేన్ సాహెబ్
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: మద్దికేర మండలం నందు డిసెంబర్ 6 నుండి 27వ తేదీ వరకు మండల వ్యాప్తంగా రెవెన్యూ గ్రామసభలను నిర్వహిస్తున్నట్లు మద్దికేర మండల తహసిల్దార్ హుస్సేన్ సాహెబ్ తెలియజేశారు.బుధవారం రోజున స్థానిక తహసిల్దార్ కార్యాలయం నందు జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులతో రెవెన్యూ గ్రామసభల నిర్వహణపై సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సభలో భాగంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఈ రెవెన్యూ గ్రామసభలో రైతుల నుండి వచ్చే భూ సమస్యలకు సంబంధించి అర్జీలను స్వీకరించి,భూ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని ఆయన అధికారులకు తెలియజేశారు.6వ తేదీన పెరవలి గ్రామం నందు,10వ తేదీన యడవలి గ్రామం నందు,12వ తేదీన మద్దికేర ఈస్ట్ నందు,13వ తేదీన మద్దికేర నార్త్ నందు,17వ తేదీన మద్ధికేర వెస్ట్ నందు,19వ తేదీన అగ్రహారం నందు, 24వ తేదీన బసినేపల్లి నందు,27వ తేదీన బురుజుల గ్రామం నందు రెవెన్యూ గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ తెలియజేశారు.కావున రైతులు 6 నుండి 27 వరకు జరిగే గ్రామ రెవెన్యూ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకొని భూ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని తహసిల్దార్ హుస్సేన్ సాహెబ్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ శ్రీదేవి,ఆర్.ఐ రవి,మండల వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!