
ఏఐటీయూసీలో చేరిన 60 మంది అంగన్వాడీ కార్యకర్తలు
న్యూస్ వెలుగు డోన్ : ఏఐటీయూసీ లో చేరిన 60 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను ఉద్దేశించి సోమవారం స్థానిక చదువుల రామయ్యా భవన్ లో ఏఐటీయూసీ (అనుబంధం ) సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామచంద్రయ్య , అంగన్వాడి అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌడేశ్వరి హాజరైనట్లు తలితమ్మ తెలిపారు.
ఈ సంధర్బంగా రామచంద్రయ్య మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పైన నిరంతరం చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి యూనియన్ లోకి పత్తికొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని తుగ్గలి, పత్తికొండ సెక్టార్ లోని 60 మంది సిఐటియు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేరుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య సిఐటియు అంగన్వాడి నాయకురాలు అయిన కాంతమ్మ, ఈరమ్మ ,చిట్టెమ్మ తిరుపతమ్మ వారితో పాటు మిగిలిన వారందరిని ఏఐటియూసి కండువాలు కప్పి ఆహ్వానించినట్లు తెలిపారు.
అనంతరం అంగన్వాడీ వర్కర్ల సమావేశంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ అసోసియేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి లలితమ్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల పైన నిరంతరం పోరాడుతూ … తమ హక్కులకోసం ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. లేనిపోని యాప్ లపైన, అధికారులు, రాజకీయ నాయకుల వేధింపుల పైన అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారమే ఏఐటీయూసీ లక్ష్యమని ఆమె అన్నారు . ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్ కృష్ణయ్య ఏఐటీయూసీ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు జి నెట్ కంటయ్య ఎం.రంగన్న ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.నబిరసూల్ , వృత్తిదారులసంఘం జిల్లా కార్యదర్శి ఎం. కారన్న సిపిఐ పత్తికొండ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ సిపిఐ పత్తికొండ పట్టణ కార్యదర్శి ఎన్.రామాంజనేయులు ఏఐటీయూసీ తాలూకా గౌరవ అధ్యక్షులు బి మాదన్న ఏఐటీయూసీ తాలూకా ఉపాధ్యక్షులు ఎం. రాజప్ప , జయలక్ష్మి సువర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.