
పార్టీ సభ్యత్వ నమోదు పై పార్టీ నేతలతో సమీక్షించిన ముఖ్యమంత్రి
అమరావతి: తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. పార్టీని బలోపేతం చేయడం, నామినేటెడ్ పదవుల భర్తీపై ఉండవల్లిలోని తన నివాసంలో నేతలతో చర్చించారు. పార్టీ అభివృద్దికోసం పనిచేసేవారికి ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన అన్నారు. పదవులు వచ్చాక పనిలో కూడా మార్పులు రావాలని ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!