ఆపదలో ఉన్న చిన్నారికి 67000 ఆర్థిక సహాయం
జమ్మలమడుగు, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు పట్టణంలోని పతంగె రామన్నరావు శతాబ్ది ప్రభుత్వం ఉన్నత పాఠశాల నందు 2002 2003 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు జమ్మలమడుగు పట్టణంలోని మిఠాయిగిరి వీధిలో నివసించే హాజీ మరియు అష్రఫ్ దంపతుల కుమారుడు చిన్నారి మహమ్మద్ అయాన్ పుట్టిన వెంటనే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నాడు. ఊపిరితిత్తుల సమస్యతో సెప్టెంబర్ 10 తేదీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రైవేటు ఆసుపత్రిలో ఖరీదైన వైద్యం చేయించుకుంటూ ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు తమ చిన్నారి ప్రాణాలు కాపాడుకో వడానికి లక్షలు వెచ్చించి వైద్యం చేస్తున్నారు. తమ చిన్నారి వైద్యం కోసం ఆర్థిక బారం పడడంతో చిన్నారి వైద్యానికి దాతల సహాయాన్ని ఆశిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జమ్మలమడుగు పట్టణంలోని మన పి.ఆర్. హైస్కూల్ సొసైటీ ఫౌండేషన్ సభ్యుల ద్వారా చిన్నారి కుటుంబానికి స్నేహితులంతా కలిసి దాదాపు రూ.67,000/- నగదు సమకూర్చి అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబీకులు (అమ్మమ్మ) కరీమున్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో బంధువులు, కుటుంబీకులు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఏమాత్రం సహాయం చేయడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో పి ఆర్ హైస్కూల్ సొసైటీ ఫౌండేషన్ సభ్యులు తమకు కష్ట కాలంలోసహాయం చేసినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పఠాన్ ఖాజాషరీఫ్ ఖాన్, కోవెలకుంట్ల ఖాజా మొహిద్దిన్, బేపారి మహమ్మద్ మజహర్ అలీ, వేల్పుల శ్రీనివాసుల యాదవ్, అనంతగిరి నరసింహులు, శ్రీనాథ్, పిట్టా రాముడు, మహమ్మద్ రఫీ తదితర మిత్రులు పాల్గొన్నారు.
బాధిత చిన్నారి కుటుంబానికి ఇంకా ఎవరైనా వైద్య ఖర్చుల కోసం సహాయం చేయాలనుకుంటే ఈ నెంబర్లను సంప్రదించండి ఫోన్ పే ద్వారా అమౌంట్ పంపించగలరు.
పేర్లు:
1.షేక్ ఆఫ్రిన్- 9182865153 2.పఠాన్ ఖాజా షరీఫ్ ఖాన్ – 8008342933