
ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 68వ వర్ధంతి
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 68వ వర్ధింతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి దళిత సంఘం నాయకులు,పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచమేధావి,అంటరానితనం,కుల వివక్షల పై అలుపెరగని పోరాటం చేసిన భారతరత్న బాబా సాహెబ్ బిఆర్ అంబేడ్కర్ అని కొనియాడారు.అలాగే ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలందరూ అన్నదమ్ములగా కలిసి మెలసి ఉన్నారంటే బిఆర్ అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగంతోనే సాధ్యమయిందన్నారు.అదేవిధంగా సిద్ధార్థ ప్రవేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు కూడా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద,టీడీపి నాయకులు చిన్నహ్యట శేషగిరి,పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్,సర్పంచ్ తనయుడు పంపాపతి,దళిత సంఘం నాయకులు మల్లేష్,వెంకటేష్,మంగన్న,కన్న రావు,బసప్ప తదితరులు పాల్గొన్నారు.