
కడప జిల్లా క్రికెట్ టీంకు 7 గురు జమ్మలమడుగు విద్యార్థులు ఎంపిక
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; కడప జిల్లా క్రికెట్ టీంకు జమ్మలమడుగు పట్టణానికి చెందిన విద్యార్థులు ఎంపికైనట్టు ఎస్.జి.ఎఫ్ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మలమడుగు పట్టణంలోని కృష్ణ క్రికెట్ కోచింగ్ సెంటర్ నందు కోచింగ్ తీసుకుంటున్న 4 గురు విద్యార్థులు అండర్ 17 విభాగంలో షేక్ మహమ్మద్ సల్మాన్, వెంకట గిరిశ్, లక్కీ, రేవంత్ మరియు అండర్ 14 విభాగంలో రామ్ చరణ్, ఇర్ఫాన్, ప్రత్యుష్ ముగ్గురు కడప జిల్లా క్రికెట్ టీంకు ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 28వ తేదీ నుంచి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు జరుగుతాయని ఈ క్రికెట్ పోటీల్లో కడప జిల్లా టీం నుంచి జమ్మలమడుగు చెందిన విద్యార్థులు పాల్గొంటారని వారు తెలిపారు. ఈ సందర్భంగా కడప జిల్లా టీంకు ఎంపికైన విద్యార్థులకు వారి తల్లి దండ్రులకు అభినందనలుతెలిపారు. జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని జిల్లా పోటీలకు ఎంపికైన విద్యార్థులకు పలువురు అభినందనలు తెలిపారు.