ముగ్గురు దొంగలు అరెస్టు

ముగ్గురు దొంగలు అరెస్టు

  28 తులాల బంగారం రికవరీ

న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూల్ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్  ఆదేశాల మేరకు కర్నూల్ డిఎస్పీ జె. బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూల్ నాల్గవ పట్టణ సిఐ మధుసూధన్ గౌడ్ మరియు ఎస్సై లు గోపీనాథ్, చంద్ర శేఖర్ లు 4 వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని పలు దొంగతనాల కేసులలో నిందితులుగా ఉన్న వంశీనాథ్, బాలు, హనుమంతు అను ముగ్గరు ముద్దాయిలు ను అరెస్టు చేసి వారి వద్ద నుండి 28 తులాల బంగారం స్వాదీనం చేసుకున్నారు.
వీరిలో హనుమంతు అంతరాష్ట్ర దొంగ , ఇతని మీద కర్ణాటక రాష్ట్రం లో పలు పిఎస్ లలోని దొంగతనం కేసులలో అరెస్టు చేశారు.
ముద్దాయిలు జల్సాలకు , జూదానికి, వ్యభిచారానికి అలవాటు పడి దొంగ తనాలు చేస్తున్నట్లు దర్యాప్తు లో తెలిసింది. ఇంటి యజమానులు , ఇంటికి తలుపులు వేసి వెళ్ళినప్పుడు విలువైన వస్తువులు బంగారు డబ్బు ఇంట్లో ఉంచరాదని , సిసి కెమెరాలు మరియు వాచ్ మెన్ లను ఏర్పాటు చేసుకోవాలని, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఈ సంధర్బంగా కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ గారు సూచించారు. ముద్దాయిలను పట్టుకోవడం రికవరీ లో కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. పోలీసు సిబ్బందికి కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్ రివార్డులు అందజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!