
భూ సమస్యల పరిష్కారానికై రెవిన్యూ సదస్సు
         సర్పంచ్ లేని రెవిన్యూ సదస్సు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని నేరణికి గ్రామంలో బుధవారం తహశీల్దార్ సతీష్ రెవిన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం రెవిన్యూ సదస్సు నిర్వహిస్తుందని చెప్పారు.రైతులు తమ భూమిలకు సంబంధించి ఏమైనా సమస్య ఉంటే రెవెన్యూ సదస్సులో అర్జీని అందిస్తే భూ సమస్యను పరిష్కరిస్తామన్నారు.సమావేశం వచ్చిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.ఈ సమావేశంలో 12 మంది రైతులు భూ సమస్యల పై అర్జీ సమర్పించారు.అలాగే 30 ఆదాయ,కుల ధ్రువీకరణ పత్రాలు అందించడం జరిగిందన్నారు.కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ముఖ్యంగా సమావేశానికి సర్పంచ్ అధ్యక్షతన వహించాల్సి ఉండగా వారి స్థానంలో తనయుడు సమావేశానికి వెళ్లిన వారిని వేదిక పై ఆహ్వానించకుండ అవమాన పరిచారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్,విఆర్వోలు దామోదర,నాగరాజు,ప్రహ్లాద,కంప్యూటర్ ఆపరేటర్ నరసప్ప,వివిధ శాఖల అధికారులు,రైతులు తదితరులు పాల్గొన్నారు


 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda