
అమరజీవికి ఘన నివాళి
న్యూస్ వెలుగు, నగరపాలక సంస్థ; ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 72వ వర్థంతి, ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం నగరపాలక కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అదేవిధంగా శ్రీ పొట్టిశ్రీరాములు చిల్డ్రన్స్ పార్కులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి కమిషనర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం నాడు పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ దీక్ష వల్లే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరి జనోద్దరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు శ్రీరాములు అని కొనియాడారు. కార్యక్రమంలో మేనేజర్ ఎన్.చిన్నరాముడు, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, డిఈఈ గంగాధర్, సిబ్బంది సుబ్బన్న, రవి, మోహన్, శేషాద్రి, రాజు, శంకర్, విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar