అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం మరువలేనివి

అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం మరువలేనివి

న్యూస్ వెలుగు, కర్నూలు; ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసుకున్న అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని , ఆశయాలను , సేవలను స్ఫూర్తి గా చేసుకొని విధుల్లో పునరంకితం అవుదామని కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా , ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ లు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయం లో  ఆదివారం  అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాయుడని, ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహర దీక్ష చేసి అమరుడైనారని గుర్తు చేశారు. ఆయన త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలు మరవరాదని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ నారాయణ, ఆర్ ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!