
పేదలను ధనవంతులు ఆదుకోవాలి ; డాక్టర్. శంకర్ శర్మ
న్యూస్ వెలుగు, కర్నూలు; గాయత్రీ ఎస్టేట్ లోని గురుదత్త పాలీక్లినిక్ లో డాక్టర్. శంకర్ శర్మ ఆధ్వర్యంలో నిరుపేద వృద్దులకు స్వేటర్లు,మాంకీ క్యాపులను అందజేశారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ చలికాలంలో చలితీవ్రత ఎక్కువగా ఉన్నందున నిరుపేద వృద్దులకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు వారికి తనవంతు సహయంగా స్వేటర్లను, మంకీ క్యాపులను ఇవ్వడం జరిగిందన్నారు. చలికాలంలో అనారోగ్యంతో భాదపడేవారు, వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్. శంకర్ శర్మ కోరారు. ఉదయం పదిగంటల వరకు బయటకు రాకపోవడం మంచిదని ఏదైనా పనిమీద బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడితే స్వేటర్ ధరించాలని ఆయన సూచించారు. చలి ఎక్కువగా ఉన్నందున అనేక రకాల వ్యాధులతో పాటు గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. చలికి చర్మరోగాలు రాకుండా వేపనూనె, కొబ్బరి నూనె పూసుకోవాలని కోరారు. సామాజిక సేవలో భాగంగా తాను చేస్తున్న సేవాకార్యాక్రమాలను మరికొందరు స్పూర్తిగా తీసుకుని పేదలకు సహయం చేయాలని డాక్టర్. శంకర్ శర్మ విన్నవించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసేందుకు దేవుడు ధైర్యాన్ని, ప్రోత్సాహన్ని ఇవ్వాలని కోరారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar