ఘనంగా గెజ్జెహళ్ళి శ్రీ ఆంజనేయ స్వామి భూమి పూజ కార్యక్రమం
హోళగుంద,న్యూస్ వెలుగు:మండల పరిధిలోని గెజ్జేహల్లి గ్రామంలో బుధవారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ జీర్ణోదారణ మరియు కొత్తగా నిర్మించే శిల దేవాలయ నిర్మాణం పనుల భూమి కార్యక్రమం గేజ్జెహళ్లి తి మ్మరెడ్డి,గేజ్జెహళ్లి హనుమంత రెడ్డి, గేజ్జెహళ్లి విరుపాక్షి రెడ్డి వంశికులు గేజ్జెహళ్లి తిమ్మారెడ్డి,సతీమణి గేజ్జెహళ్లి సావిత్రమ్మ,గేజ్జెహళ్లి హనుమంత రెడ్డి కుటుంబ సభ్యులు,గేజ్జెహళ్లి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పురోహితులు జేకే నర్సింగాచార్,జెకె రాజీవ్ ఆచార్ శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి వేదమంత్రోచ్ఛారణలు పటిస్తూ గణపతి పూజ,గోపూజ,గో ప్రదక్షణ,హోమం,జైశ్రీరామ్,జై ఆంజనేయ,జై రామలక్ష్మణ జయ జయ ధ్వనుల మధ్య భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజి సాగునీటి సంఘం అధ్యక్షుడు మరియు వంశపారంపర్య ధర్మకర్త గెజ్జేహళ్ళి హనుమంత రెడ్డి మాట్లాడుతూ ఆంజనేయస్వామి ఆలయం నిర్మించి వందేళ్లు అయిందని దాని ఆలన పాలన తామే చూస్తున్నానని అన్నారు.1959లో తమ తాతగారైన గెజ్జేహాళ్ళి తిమ్మారెడ్డి కుమార్తె శంకరమ్మలు మొదటిసారిగా ఆంజనేయస్వామి ఆలయ జీర్ణోదారణ పనులు చేశారని చెప్పారు.ఈ భూమి పూజా కార్యక్రమంలో వంశ పారంపర్య ధర్మకర్తలు గేజ్జెహళ్లి తిమ్మారెడ్డి,గేజ్జెహళ్లి సావిత్రమ్మ, గేజ్జెహళ్లి హనుమంత రెడ్డి, గేజ్జెహళ్లి శ్రీనివాసరెడ్డి, భక్తులుశివరామరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కృష్ణ సాగర్ రెడ్డి, రామ్ సాగర్ రెడ్డి, వరలక్ష్మి రెడ్డి, ఎం హనుమంత్ రెడ్డి, వెంకన్న గౌడ, పూజారి రామ, సోమి, కాళ్లప్పాచారి, రామలింగ, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.