జిల్లా వ్యాప్తంగా రెవిన్యూ సదస్సులు : జాయింట్ కలెక్టర్
ప్రజల నుంచి 2,729 అర్జీలు స్వీకరణ
జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి
న్యూస్ వెలుగు, ఏలూరు జిల్లా ప్రతినిధి: ఏలూరు జిల్లాలో 28 మండలాల్లో మొత్తం 665 రెవిన్యూ గ్రామాలుండగా ఇంతవరకు 254 గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు. జిల్లాలో శుక్రవారం నిర్వహించిన 31 రెవిన్యూ సదస్సుల్లో 1456 మంది పాల్గొని ఆయా సమస్యలపై 307 అర్జీలను అందజేయగా వాటిలో అప్పటికప్పుడే 77 అర్జీలు పరిష్కరించడం జరిగిందన్నారు.రెవిన్యూ సదస్సులలో అందిన విజ్ఞప్తులను 45 రోజులలోగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన 254 గ్రామ రెవిన్యూ సదస్సులకు 11,922 మంది హాజరై 2,729 అర్జీలు అందజేయగా ఇప్పటికే 521 అర్జీలు పరిష్కరింపబడ్డాయన్నారు. రెవిన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతీ మండలానికి జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందన్నారు. జనవరి 8వ తేదీ వరకు ఆయా గ్రామల్లో నిర్వహించే రెవిన్యూ సదస్సులలో ప్రజలు పాల్గొని తమ భూములకు సంబందించిన సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందాలన్నారు.