రంగంలోకి  డ్రోన్ కెమెరా…!

రంగంలోకి డ్రోన్ కెమెరా…!

 కర్నూలు ఫోర్త్ టౌన్ పరిధిలో 6 ఒపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు.

న్యూస్ వెలుగు, కర్నూలు; జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్  ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలో నేర నివారణే లక్ష్యంగా పోలీసులు విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ సంధర్బంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్,రిజిస్టర్ ఆఫీస్, ఉల్చాల రోడ్డు పరిసర ప్రాంతాలలో బహిరంగ మద్యం పై డ్రోన్ కెమెరాతో నిఘా ఉంచి 6 మంది పై కేసులు నమోదు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల పై , బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారి పై నిరంతరం పర్యవేక్షణ నిఘా కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నాల్గవ పట్టణ ఎస్సై చంద్రశేఖర్ , ఎ ఎస్ఐ రామ మునయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!