అమ్మా ఇవిగో మీ చీరలు..!
కర్నూలు ఒన్ టౌన్ సిఐ రామయ్యనాయుడు
సిసి కెెమెరాల ద్వారా ఆటో ను గుర్తించిన కర్నూలు ఒన్ టౌన్ పోలీసులు.
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూల్ వన్ టౌన్ మించిన బజార్ నందు 18.12.2024 వ తేదీన గుర్తు తెలియని ఆటోలో స్వాతి అనే అమ్మాయి ఐదు చీరలను ఆటోలో మర్చిపోయింది. కర్నూల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్స్ షేక్షావలి, ఆంజనేయులు ఇద్దరు కర్నూల్ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపియస్ మున్సిపాలిటీ సహాకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ఆ ఆటో యొక్క ఆచూకీ కనుగొన్నారు.సుమారు రూ. 35 వేలు, 40 వేల విలువ చేసినటువంటి ఐదు చీరలను స్వాతి అనే రెవెన్యూ కాలనీ కర్నూల్ టౌన్ కి చెందిన అమ్మాయికి కర్నూల్ వన్ టౌన్ సిఐ ఎం రామయ్య నాయుడు స్వాతి అనే అమ్మాయికి వారి చీరలను కర్నూలు ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ లో అప్పగించారు.
Was this helpful?
Thanks for your feedback!