
ఘనంగా ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు
న్యూస్ వెలుగు, కర్నూలు; మొట్టమొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని కర్నూలు లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని రామచంద్ర మిషన్, హార్ట్ ఫుల్ నెస్ ఇన్సిస్ట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమానికి కర్నూలు డిఎస్పీ మహాబూబ్ బాష, యోగా గురువులు హాజరై యోగాతో పాటు ధ్యానం చేశారు. ఈసందర్భంగా రామచంద్ర మిషన్ కోఆర్డినేటర్ వెంకట రెడ్డి మాట్లాడుతూ
భారతదేశం సూచనమేరకు యునైటెడ్ నేషన్స్ డిశంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవం ఏర్పాటు చేసిందని తెలిపారు. ధ్యానం, యోగా ప్రాధన్యతను ఆయన తెలిపారు. ధ్యానం ఎన్నో సంవత్సరాల క్రితమే మనదేశంలో ఉందన్నారు. అన్ని సమస్యలకు ధ్యానం పరిష్కరం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. బత్తిడిని దూరం చేసి ప్రశాంతతను చేకుర్చేది ఒక్క ధ్యానమే అని వెంకటరెడ్డి తెలిపారు. ముఖ్య అతిధి డిఎస్పీ మహాబూబ్ బాష మాట్లాడుతూ ప్రస్తుతం యువత రెండున్నర నిమిషాల కన్న ఎక్కువ ఏకాగ్రతగా ఉండడంలేదని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితి వల్ల వారి కుటుంబంలో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఈసమస్యకు ధ్యానం చక్కటి పరిష్కారం చూపుతుందని డిఎస్పీ మహాబూబ్ బాబు తెలిపారు. రామచంద్ర మిషన్ లో ప్రతి ఆదివారం, బుధవారం ధ్యానం చేస్తారని అందరూ ఈకార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.
ఈకార్యక్రమంలో వెంకట రెడ్డి, డిఎస్పీ
మహాబూబ్ బాష,
సతీష్ కుమార్,రామాంజనేయులు, నగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.