
నారాయణ పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు
న్యూస్ వెలుగు, కర్నూలు; ఏసు క్రీస్తు జన్మదినం సందర్భంగా మంగళవారం స్థానిక మాధవనగర్ లోని నారాయణ పాఠశాలలో ప్రిన్సిపల్ మహమ్మద్ అల్తాఫ్ ఆధ్వర్యంలో 
సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ ఎ జి ఎం రమేష్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహించిన సంబరాలకు యునైటెడ్ క్రిస్టియన్ మినిస్ట్రీ సెక్రటరీఎం సుధీకర్ ముఖ్య అతిధిగా హాజరై క్రిస్మస్ ప్రాముఖ్యతను వివరించారు. ఏడాదికి ఒకసారి వచ్చే క్రిస్మ
ప్రజలకు ప్రేమాభిమానాలు, సుఖసంతోషాలు తెస్తుందన్నారు. ఏసు క్రీస్తు నేర్పిన మాటలు శాంతి, సమాధానం, సంతోషం ప్రతి ఒక్కరు అనుసరించాలని సూచించారని,
మానవ రూపంలో పాపాలను తొలగించడానికి క్రీస్తు భూమిపై అవతరించారని గుర్తు చేశారు. వేడుకల్లో భాగంగా క్రీస్తు జననం నమూనాను చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు, శాంట క్లాస్ వేషధారణ అందరిని ఆకట్టుకున్నాయి.వేదిక పై క్యాండిల్ వెలిగించి స్టూడెంట్స్, టీచర్స్ క్రిస్మస్ శుభాకాక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నాగేశ్వరి, 
రాధ పాల్గొన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar