
అమిత్ షా రాజీనామా చేయాలి
బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు
న్యూస్ వెలుగు, కర్నూలు; అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా అనుచిత వాక్యాలు చేశారని కర్నూలు లో బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. అమిత్ షా ను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంబేద్కర్ వల్లే దేశంలో సమానత్వం ఉందని అలాంటి మహానీయుడిపై అసభ్యంగా మాట్లాడడం సరికాదని తెలిపారు. వెంటనే అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు తోపాటు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జైరాజ్, ఉపాధ్యక్షుడు సామ్యేల్,జిల్లా ఇంచార్జ్ అరుణ్ కుమార్, జనరల్ సెక్రటరీ దాసరి ఎర్రన్న, ట్రెజరర్ సలీంబాష, రాజ్ కుమార్, ఫైయాజ్ బాష, రామలింగ తదితరులు పాల్గొన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar