కోడుమూరు -ఎమ్మిగనూరు రోడ్డు మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తిచేయాలి

కోడుమూరు -ఎమ్మిగనూరు రోడ్డు మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తిచేయాలి

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు,  న్యూస్ వెలుగు: కోడుమూరు – ఎమ్మిగనూరు రోడ్డు మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా

కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆర్ అండ్ బి ఎస్ఈ ని ఆదేశించారు.గురువారం కె.నాగలాపురం నుండి కోడుమూరు మండలం వరకు జరుగుతున్న ఆర్ అండ్ బి రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్ అండ్ బి రోడ్లకు సంబంధించిన పనుల పురోగతి గురించి ఆర్ అండ్ బి ఎస్ఈ ని అడిగి తెలుసుకున్నారు..జిల్లాలో ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు..ఆదోని డివిజన్ లో రోడ్ల నిర్మాణపు పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఈ రామచంద్రారెడ్డి, డ్వామా పిడి వెంకటరమణయ్య, పంచాయతీ రాజ్ ఈఈ మద్దన్న, డిపిఓ భాస్కర్, గూడూరు ఎంపిడిఓ శివ నాగప్రసాద్, తహసీల్దార్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!