
పీవీఆర్ కమ్యూనికేషన్ షాపులో ప్రతి కొనుగోలు పై బహుమతులు
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు నగరంలోని యూకాన్ ప్లాజా లో ఉన్న పీవీఆర్ కమ్యూనికేషన్ సెల్ ఫోన్ షాపు పెట్టి 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా షాపులో ప్రార్థన కూడికలు నిర్వహించారు. షాపు నిర్వహాకుడు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రంలో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ కేక్ కట్ చేసి క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు. ఈసందర్భంగా షాపు యజమాని మాట్లాడుతూ పీవీఆర్ కమ్యూనికేషన్ ను ఇరవై సంవత్సరాలుగా ఆదరిస్తున్న కష్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు.20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా షాపులో కొనుగోలు చేసిన కష్టమర్లు కు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. ప్రతి 300 రూపాయల కొనుగోలు పై 150 రూపాయలు విలువ చేసే బహుమతులు, 500₹ మరియు 600 రూపాయలు కోనుగోలు చేసిన కష్టమర్లకు 300₹ నుంచి 400 రూపాయలు విలువ చేసే బహుమతులు ఇస్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈఆఫర్లు ఒక నెల రోజులు పాటు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఈకార్యక్రమంలో
సంఘ సెక్రటరీ ఏడీఏ లింకన్,
సంఘ కాపరులు రెవ. జీవన్ రెవ. అనిల్ కుమార్ స్వామి, బిషప్ అమ్ రోజ్, రెవ. జెట్టి ప్రభుదాసు, రెవ.డి టి కృష్ణఫర్ జీసెస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు పాస్టర్ జీ. రవికుమార్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar