
నారాయణ పాఠశాలలో గణిత ప్రదర్శన
న్యూస్ వెలుగు, కర్నూల్; మేధావులు సాధించలేని సమస్యలను అలవోకగా సులభమైన పద్ధతిలో పుస్తకాల సాయం లేకుండా
జాతీయ గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ 
మాట్లాడుతూ రామానుజన్ చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారన్నారు. గణిత శాస్త్రంలో ఆయన చేసిన ఎన్నో లెక్కలు ,ఫార్ములాలు అన్ని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయని, అందుకే రామానుజన్ సేవలకు గుర్తింపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన జయంతికి గుర్తు గా జాతీయ గణిత దినోత్సవం గా ప్రకటించిందని గుర్తు చేశారు. ముందుగా విద్యార్థులూ స్వతహాగా తయారు చేసిన గణిత నమూనాలను వీక్షించిన అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ చేతులు మీదుగా ధ్రువపత్రాలు అందజేసారు. 
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నాగేశ్వరి పాల్గోన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar