జోరుగా సీసీ రోడ్డు నిర్మాణ పనులు
హొళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలోని అయోధ్య నగర్ సోమవారం మండల ప్రజా పరిషత్ నిధులు మరియు పంచాయతీ నిధులతో ఎంపీపీ, వార్డు సభ్యుల సహాయ సహకారంతో సిసి రోడ్డు పనులు చేపట్టారు.ప్రజలు చాలా రోజులగా నుండి కాలనీకి సీసీ రోడ్డు వేయాలని వార్డు సభ్యులు, ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లడంలో స్పందించిన వారు సోమవారం సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు.దీంతో కాలనీ వాసులు వారికి కృతజ్ఞతలు తెలపడంతో పాటు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనయుడు ఈసా,వార్డు సభ్యులు శంకరప్ప,నిసార్, మల్లయ్య,మర్రి స్వామి తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!