
పార్క్ కార్మికుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు
న్యూస్ వెలుగు, కర్నూలు; 2025 సంవత్సరంలో కర్నూలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని కర్నూలు నగర పాలక సంస్థ అధికారులు తెలిపారు. కర్నూలు నగర పాలక సంస్థ ఉద్యనవనం కార్యాలయ ఆవరణలో నూతన సంవత్సర వేడుకలను అధికారులు ఇంజనీరింగ్ విభాగం పార్క్ కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేషన్ సుపరింటెండెంట్ ఇంజనీర్ రాజశేఖర్ హాజరై నూతన సంవత్సర కేక్ ను కార్మికుల సమక్షంలో కట్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని సుందరంగా ఉంచడంతో పాటు పూల మొక్కలను నగరవాసులకు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యానశాఖ ఏడీ విజయలక్ష్మి మాట్లాడుతూ మొక్కలను కార్పోరేషన్ ఆధ్వర్యంలో పెంచి వాటిని పార్క్ లలో ఏర్పాటు చేస్తామన్నారు. ఇండ్లలో మొక్కలు ఏర్పాటు చేసుకునే వారికి ఎర్రమట్టి అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా కర్నూలు లో నూతనంగా ఉద్యనవన పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్.ఈ. రాజశేఖర్, యంఈలు శేషసాయి, సత్యనారాయణ, డీఈలు మనోహర్ రెడ్డి, శ్రీనివాసులు,ఏఈ నాగజ్యోతి ఉద్యానశాఖ ఏడీ విజయలక్ష్మి, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం పార్క్ కార్మికుల నాయకురాలు కే. జ్ఞానమ్మ, కార్మికులు నాగేశ్వరమ్మ అన్ని లక్ష్మీదేవి శివకుమార్ మురళి,బీ.ప్రకాష్ తదితరులుపెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.