
శానిటేషన్ మెరుగుపరుచుటకు పలు సూచనలు
విజయవాడ, న్యూస్ వెలుగు;   శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము లో ఆలయ డిప్యూటీ ఈవో ఎం రత్నరాజు
ఇందులో భాగముగా శానిటేషన్ నిర్వహణ మెరుగుపరచాలని, క్యూ లైన్ లో భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా అమ్మవారి దర్శనం త్వరగా  సంతృప్తికరముగా అయ్యేలాగా ఉండాలని, సామాన్య భక్తులే విఐపి లని, సిబ్బంది అందరూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, వారి సంతృప్తికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, తధనుగుణముగా అందరూ నడుచుకోవాలని తెలిపి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. శానిటేషన్ విభాగం సిబ్బందితో సమావేశమై, పలు ప్రదేశములలో శానిటేషన్ మెరుగుపరుచుటకు గాను అవసరమగు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఏఈఓ పి. చంద్రశేఖర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist