
బేడ బుడగ జంగం కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి
న్యూస్ వెలుగు, కర్నూల్; బేడ బుడగ జంగం కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు డిమాండ్ చేశారు. నేను శుక్రవారం కలెక్టర్కు హ వినతిపత్రం అందజేసి కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్మానం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కమిషన్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఎస్సై వర్గీకరణ అంశంలో వెనుకబడినటువంటి షెడ్యూల్ కులాల 57 ఉపకులాలు ఉన్నాయని వారిని గుర్తించి వారిని కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు 57 ఉపకులాల వర్గీకరణ గుర్తించుకొని 15% బేడ బుడగ జంగం ఉన్నారని వారిని కూడా చేర్చాలని పేర్కొన్నారు m బేడ బుడగ జంగం ఎస్సీ కుల సర్టిఫికెట్లు లేక వారి పిల్లలు భవిష్యత్తు చదువుకొని కూడా వాళ్లకు కుల సర్టిఫికెట్ లేదందున వాళ్లు భిక్షాటన కూలి పనులకు పోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బేడ బుడగ జంగం కులస్తులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని వారిని గుర్తించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.