
సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలలో పాల్గొన్న పత్తికొండ ఎమ్మెల్యే
ఆదర్శవంతమైన ఉపాధ్యాయిని కళ్యాణి కుమారి
కళ్యాణి మేడమ్ ని ఘనంగా సన్మానించిన పత్తికొండ ఎమ్మెల్య కెయి శ్యామ్ కుమార్
పత్తికొండ/ తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని జే యం తండా గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల సమక్షంలో పత్తికొండ నియోజకవర్గ శాసన సభ సభ్యులు కెయి శ్యామ్ కుమార్ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమానికి ముందుగా పాఠశాలలోని విద్యార్ధిని విద్యార్థులు పాఠశాలలోకి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పత్తికొండ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ మాట్లాడుతూ భారత దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆమె పేద ప్రజల కుటుంబాలలో విద్యను అందించేందుకు తన. భర్త మహాత్మా జ్యోతిభా పూలే తో కలిసి చేసిన సేవలు మరువలేనివని వారు మహిళా అభ్యుదయం కోసం అహర్నిశలు శ్రమించి కృషి చేశారని వీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయులని సావిత్రి బాయిని ఆదర్శంగా తీసుకొని జె యం తాండ పాఠశాలలోని పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు కళ్యాణి కుమారి గతంలో నలుగురు విద్యార్థులు కూడా లేని పాఠశాలలో ప్రస్తుతం 43 మంది విద్యార్ధిని విద్యార్థులు ఉండడం వారికి గురుకుల పాఠశాలలో సీటు రావడం కోసం అహర్నిశలు కృషి చేసి కృషి పాఠశాలలోని విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు రావడానికి కృషి చేసిన మంచి మనసున్న టీచర్ కళ్యాణి కుమారి అని ఆమె చేసిన సేవలను కొనియాడుతూ,టీచర్ కళ్యాణి కుమారి కూడా ఆదర్శవంతమైన ఉపాధ్యాయిని అని,అందరూ ఉపాధ్యాయిని ఉపాద్యాయులు కళ్యాణి కుమారి మేడంను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులకు మంచి విద్యాబోధన అందిస్తే పిల్లలు ప్రైవేట్ పాఠశాలల వైపు చూడకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతారని ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ తెలియజేశారు.కార్యక్రమం అనంతరం జేఎం తండా పాఠశాల ఉపాధ్యాయిని కళ్యాణి కుమారికి ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పాఠశాలలోని విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులను ఉచితంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు నాగ భూషణం,విద్యార్ధిని విద్యార్థులు,మండల విధ్యాది కారులు రమేష్ బాబు, తిమ్మా రెడ్డి మరియు టిడిపి సీనియర్ నాయకులు కె సాంబ శివ రెడ్డి.టిడిపి ముఖ్య నాయకులు,కార్యకర్తలు జే యం తండా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.