ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 19 అర్జీలు

న్యూస్ వెలుగు, కర్నూల్; ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు

అధికారులకు సూచించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 19 అర్జీలు వచ్చాయి. వాటి పరిష్కారానికి తగిన చర్యలు త్వరితగతిన తీసుకుంటామని అర్జీదారులకు కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ప్రజారోగ్యధికారి డా. కె.విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఈ రాజశేఖర్, ‌సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆర్ఓ జునైద్, ఎంఈలు సత్యనారాయణ, శేషసాయి, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, టిడ్కో అధికారి పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు

వచ్చిన అర్జీల్లో కొన్ని..

1. నగరపాలకలో పనిచేస్తూ మృతి చెందిన తమ తల్లిదండ్రుల స్థానంలో కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగవకాశం కల్పించాలని చింతలమునినగర్‌కు చెందిన టి.వెంకట కుమార్ అభ్యర్థించారు.
2. తమ కాలనీలో మురుగు కాలువలు నిర్మించాలని క్రిష్ట నగర్ కేడీసీసీ బ్యాంకు ఎటిఎం పక్కనున్న లైను వాసులు, బిటిఆర్ నగర్ నివాసులు ఎంవీ పార్థసారథి, బి.రాధక్రిష్ణ, ఆర్.నర్సయ్య, టి.రమణ అర్జీలు సమర్పించారు.
3. మారుతి నగర్ పార్కును అభివృద్ధి చేయాలని, నడకబాట, బెంచీలు నిర్మించాలని స్థానికులు చాంద్ హుస్సేన్, ఇసాక్ అభ్యర్థించారు.
4. టిడ్కో గృహానికి అనర్హులు కాబడినందున తాము చెల్లించిన డిడి నగదును వెనక్కి ఇవ్వాలని టి.విజయమ్మ, జి.యలమ్మ, ఎన్.దానమ్మ కోరారు.
5. ముజఫర్ నగర్ నండూరి ప్రసాదరావు మెమోరియల్ కమ్యూనిటీ హాల్‌లో ఉన్న సచివాలయాలను మరో చోటికి తరలించి, దానిని ప్రజలు ఉపయోగించుకునేందుకు తిరిగి ఇవ్వాలని కమ్యూనిటీ హాల్ నిర్వాహకులు సుధాకరప్ప, రాధాక్రిష్ణ, మోహన్ బాబు తదితరులు కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!